పులివెందుల: వేంపల్లిలో కూల్ డ్రింక్ తాగిన కోతి
Pulivendla, YSR | Sep 22, 2025 కోతి చేష్టలు అంటే ఇవేనేమో..? కోతి ఏ పని చేసినా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది.. అలాంటి పనితో మరోసారి వైరల్ అయ్యింది ఓ వానరం.. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఓ వానరానికి దాహం వేసింది. గోడపై కూర్చొని ఇటు అటు చూసి ఓ పిల్లవాడు కొనుక్కుని తాగుతున్న స్ప్రైట్ బాటలను గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా గోడపై నుంచి మెల్లగా దిగి పిల్లాడి చేతిలోంచి స్ప్రైట్ బాటలను లాక్కుంది. ఇంకేముంది లట్టుకున్న గోడపైకి.. ఎక్కి కూర్చుంది. తీపి తీపి గా ఉన్న స్ప్రైట్ ను గుక్కెడు గుక్కెడు తాగుతూ బాటిల్ ను ఖాళీ చేసింది.