గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం దిగువ ముద్ది కుప్పం దళితవాడలో పల్లెనిద్ర కార్యక్రమం
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, దిగువ ముద్ధి కుప్పం దళితవాడలో మంగళవారం కార్వేటినగరం సిఐ హనుమంతప్ప, ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.