చంద్రబాబు పాదం అరిష్టం : నెల్లూరులో మాజీ మంత్రి కాకాని హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం చేశారో.. అప్పటినుంచి రాష్ట్రానికి అరిష్టం పట్టిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. భద్రత కల్పించకపోవడం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ బుగ్గ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ నెల్లూరులో ఆదివారం రాత్రి వారు కొవ్వొత్తులతో ర్యాలీ తెలిపారు