కలికిరి పెద్ద చెరువు కట్టను అధికారులు సోమవారం పరిశీలించారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై రోడ్డు నెర్రెలు వారింది. దీంతో చెరువు కట్ట దెబ్బ తిందని అధికారులకు అందిన సమాచారంతో ఇరిగేషన్ అధికారులు, ఈఈ సురేష్ బాబు, డిఇ గోపీ క్రిష్ణ,ఏఈ శ్రీనివాసులు, ఎంపిడిఓ భానుమూర్తి రావు, డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రియాజుద్దీన్,ఈఓ అశోక్, కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి, నీటి పారుదల సంఘం అధ్యక్షుడు స్టాంపుల రత్న శేఖర్ రెడ్డి కట్టను పరిశీలించారు. కట్టకింద తూమును గతంలో మూసి వేసిన కారణంగా ఆ ప్రాంతంలో నీరు లీకేజీ కారణంగా కొద్దిగా రోడ్డ