అదుపుతప్పిన కారు ఓ చెప్పుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన కోడూరు-గొల్లపాలెం రహదారిలో చోటుచేసుకుంది. గురువారం గొల్లపాలెం సెంటర్లో పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న దుకాణంలో జనం ఉండగానే కారు ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.స్థానికులు 108 ద్వారా గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.