గాజువాక: నియోజకవర్గ అభివృద్ధి పై గాజువాక జోనల్ అధికారులతో సమావేశమైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్
రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయంలో జోన్–6 జడ్సి, స్టీల్ ప్లాంట్ ఎస్డీసీ, ఎంఆర్ఓలు, ఈఈలు మరియు ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రోడ్లు, మైదానాలు, పార్కులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతులు చేరేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని పల్లా గారు ఆదేశించారు.