పత్తికొండ: పత్తికొండ టమోటో మార్కెట్లో కుప్పకూలిన టమోటా ధర రోడ్డుపై టమోటా ను పర పోస్తున్న రైతులు
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. మంగళవారం ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.2కి చేరడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రవాణా ఖర్చులు కూడా రావడం లేదని, తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.