టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన డిఆర్సి సమావేశంలో మంత్రి స్వామి టంగుటూరు వద్ద అధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. గతంలో సమస్యల పరిష్కారంపై తీసుకోవలసిన విషయాలను పొందుపరచడం జరిగిందని ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని మంత్రి స్వామి అధికారులను ప్రశ్నించగా అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో మంత్రి కార్యాలయంలో మాట్లాడారు.