పత్తికొండ: క్రిష్ణగిరి మండలంలో ట్రాక్టర్ బోల్తా మహిళ కూలి మృతి 20 మందికి గాయాలు
క్రిష్ణగిరి మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు చనిపోయారు. కోయిలకొండ నుంచి సుమారు 20 మంది మహిళలు నిత్యం కూలీ పనికి వెళ్తుంటారు. ఇందులో భాగంగా సోమవారం ట్రాక్టర్లో పనికి వెళ్తుండగా ముందు టైరు బేరింగ్ ఊడి వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో కోయిలకొండకు చెందిన మండ్ల సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.