మార్కాపురం: సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు నిరసన ర్యాలీ
ఆటో క్యాబ్ టాటా ఏసీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు రఫీ అన్నారు. మార్కాపురం ఎస్ వి కె పి కళాశాల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో క్యాబ్ టాటా ఏసీ డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో రవీంద్రరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రఫీ మాట్లాడుతూ... సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంవత్సరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.