పూతలపట్టు: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ పూతలపట్టులో ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు
పూతలపట్టు మండల కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై వైయస్సార్సీపి నిరసన ర్యాలీ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్లు, నాయకులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు స్థానిక తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.