శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ మద్యం పై దాడులు నిర్వహించారు.కొత్తపేట ప్రాంతంలో దేశావత్ నాగరాజు వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 49 మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు.అలాగే మేకల బండ ప్రాంతంలో లక్ష్మీదేవి అనే మహిళ మోటార్ సైకిల్ టైరులో దాచిపెట్టిన 16 మద్యం బాటిల్స్‌ను గుర్తించి సీజ్ చేసి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు