ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం చేసిన డివిజన్ వైద్యాధికారి డాక్టర్ శేఖర్
రాజంపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య వారోత్సవాలు రాజంపేట పట్టణంలోని ఈడికి పాలెం అర్చన్ ఫైమర్ హెల్త్ సెంటర్లో డివిజనల్ వైద్యాధికారి డాక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో బుధవారం స్వస్థ నారీ - సశక్త పరవార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు జరగనుంది. మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్, హీమోగ్లోబిన్, హిమోగ్లోబిన్, పోషణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శేఖర్ పిలుపునిచ్చారు.