వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశముండటంతో జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అనంతపురం నగరంలోని పురాతన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకల సౌకర్యాలు,సీసీటీవీ పర్యవేక్షణ,ఎమర్జెన్సీ స్పందన ఏర్పాట్లను సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతియుతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.