అసిఫాబాద్: వాంకిడి వారసంతకు సౌకర్యాలు కరువు, ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు,ప్రజలు
వాంకిడి వారసంతకు వచ్చే వ్యాపారులు,ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. వాంకిడి GPకి ఆదాయం వస్తున్న కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వ్యాపారులు,స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంతలో వ్యాపారులకు కనీసం షెడ్లు లేకపోవడంతో కర్రలకు కవర్లు కట్టి వ్యాపారాలు జరుపు కుంటున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యావసర సరకులు, కూరగాయాలు కొనుగోలు చేయడానికి వారసంతకు వస్తుంటారు. చిన్నపాటి వర్షానికి సైతం బురదకావడంతో నిత్యవసర సరుకులు,కూరగాయాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడాల్సి వస్తోంది. సంతలో షెడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో వ్యాపారులు, ప్రజలు తడుస్తూ క్రయవిక్రయాలు చేయాల్సి వస్తుందని ఆవే