ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం అందక చాలా కుటుంబాలు నష్టపోయాయని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి నిర్మాణం మొదలుపెట్టారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో లేకుండా ప్రైవేటీకరణ చేయటం సరైన విధానం కాదని అన్నారు.