బుగ్గానపల్లిలో పదవీ విరమణ పొందిన దేశ సైనికుడికి ఘన స్వాగతం
Dhone, Nandyal | Nov 2, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానపల్లిలో రిటైర్మెంట్ అయిన దేశ సైనికుడు గుమ్మ శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. గుమ్మ శ్రీనివాస్ దేశ సేవలో 17 ఏళ్ల పాటు సైనికుడిగా పనిచేశారు. ఆదివారం రిటైర్మెంట్ తర్వాత గ్రామానికి రావడంతో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు. తమ గ్రామానికి చెందిన గుమ్మ శ్రీనివాస్ దేశ సరిహద్దులో 17 సంవత్సరాల పాటు సేవలందించడం ఆనందం కలిగించిందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.