జగిత్యాల: కలెక్టరేట్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, పెట్రోల్ పోసుకుని చనిపోతానని బెదిరించినవ్యక్తులపై కేసు నమోదు: సిఐ కరుణాకర్
తేదీ 15- 9-2025 సోమవారం ప్రజవాణి సమయంలో అక్రమంగా కలెక్టరేట్ లోపటికి ప్రవేశించి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ పెట్రోల్ పోసుకుని చనిపోతానని బెదిరించిన మరియు పోలీసులపై పెట్రోల్ పడడానికి కారణమైన కొందరు వ్యక్తులపై జగిత్యాల టౌన్ కానిస్టేబుల్ విజయేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ సబ్ఇన్స్పెక్టర్ కే. కుమారస్వామి కేసు నమోదు చేయడం జరిగిందని జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పీ కరుణాకర్ మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.