పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలికిరి మండలం పత్తేగడ గ్రామం పాళెం కి చెందిన రమణ ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.కలికిరి మండలం కోటాల గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్లవీర గంగమ్మ గుడిలో విగ్రహాప్రతిష్ట మరియు పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పంచాయతీ దండువారి పల్లి కి చెందిన నాగేశ్వరరావు కుమారుని వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు