దర్శి: దర్శి లో 12వ తేదీ వైసీపీ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Nov 10, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు వైసీపీ జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని, వైద్య సేవలలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 12వ తేదీ దర్శిలో నిర్వహించే ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.