మొంథా తుఫాను ప్రభావంతో ఆసిఫాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ముసురు వాన పడుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చిన పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లకుండా రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు.