సర్వేపల్లి: కాంట్రాక్టర్ల పై క్రిమినల్ కేసులో నమోదు : కొమ్మలపూడిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
గిరిజనులకు కట్టించే ఇల్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్టర్లు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమ్మలపూడిలో ఆయన పర్యటించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎస్టీ కాలనీలో చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, గొడుగులు, పెద్దలకు దుప్పట్ల పంపిణీ చేశారు.