శ్రీకాకుళం: ఇచ్ఛాపురంలో ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం mla అశోక్ ని కలిసిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు
ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. తమ సమస్యను శాసనసభలో ప్రస్తావించాలని, తమకు న్యాయబద్ధంగా అమలు చేయవలసిన ఓపిఎస్ ను అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ మేమో 57 ప్రాప్తికి ఓపిఎస్ అమలు ఉత్తర్వులను ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ శాసనసభలో అంశం ప్రస్తావిస్తామన్నారు.