రంపచోడవరం డివిజన్ కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కొరకు ఆందోళన కార్యక్రమం నిర్వహణ
రంపచోడవరం డివిజన్ కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కొరకు బుధవారం మధ్యాహ్నం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు డివిజన్ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అపరిమిత మెడికల్ సదుపాయం కల్పించాలని, విద్యుత్ గ్రేడ్ 2 ఉద్యోగులను జూనియర్ లైన్మెన్లుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.