ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. కొద్దిసేపు శ్రీనివాసులు క్రికెట్ ఆడి విద్యార్థులను ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి అన్నారు. విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.