డోన్ మండలం వెంకటాపురం – తుమ్మచెరువు వద్ద శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి డోన్ పోలీసులకు సమాచారం తెలిపారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు 30-35 మధ్యలో ఉండొచ్చని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.