గుంతకల్లు: కొంగనపల్లి సమీపంలో టవర్స్ పనులు చేస్తున్న సమయంలో పాముకాటుకు గురైన కార్మికుడు, ఆసుపత్రికి తరలింపు
గుంతకల్ మండలం కొంగనపల్లి సమీపంలో టవర్స్ పనులు చేస్తున్న సమయంలో రాజీవ్ అనే కార్మికుడు పాముకాటుకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజీవ్ గత కొంతకాలంగా టవర్స్ ఏర్పాటు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పనులు చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు.