ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినదే. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వారి దర్యాప్తులో మృతుడు త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి చెందిన కొదమల కృష్ణ గా గుర్తించామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.