అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకోవాలి : మాజీ మంత్రి కాకాణి
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. 2023లో నమోదైన కేసులో వీరి చలపతిని అరెస్ట్ చేసి, 16 సెక్షన్ల కింద కేసు నమోదు చెయ్యడం దారుణం అన్నారు. ప్రతి ఒక్కటీ గుర్తు పెట్టుకుంటామని, భవిష్యత్తు లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న చలపతిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.