అసిఫాబాద్: నిషాని గ్రామంలో దండారి సంబరాలు
కెరమెరి మండలం నిషాని గిరిజన గ్రామంలో శుక్రవారం దండారీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గిరిజనులు యేత్మసార్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. తాజాగా, కెరమెరి, జైనూర్, లింగాపూర్, ఆసిఫాబాద్ మండలాల్లో దండారీ పండుగ ప్రారంభమైంది. నిషాని గ్రామానికి అతిథిగా దండారీ బృందం చేరుకోగా, స్థానికులు మర్యాదలు చేశారు. డప్పులు వాయిస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు ఏకమై సంప్రదాయ నృత్యాలు చేశారు.