వైరా: వైరా సీపీఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు ముఖ్య సమావేశం
Wyra, Khammam | Sep 19, 2025 వైరా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి కోరారు. సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి వర్గం సమావేశం వైరా బోడేపుడి భవన్ లో మచ్చా మణి అధ్యక్షతన జరిగినది, సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు,