పిడిఎస్ రైస్ నిర్దారణ అయితే చర్యలు తప్పవు : సివిల్ సప్లై అధికారులు వెల్లడి
నెల్లూరు సిటీ పరిధిలోని నవలాకుల తోటలో గత రాత్రి ఐదు లారీల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. లారీలను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే లారీలో ఉన్న బియ్యం పిడిఎస్ రైసా లేక నార్మల్ బియ్యమా అనే దానిపై సివిల్ సప్లై అధికారులు విచారణ జరుగుతున్నారు. శాంపిల్స్ సేకరించామని.. పిడిఎస్ రైస్ అని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలిపారు