ఆందోల్: తద్దాన్ పల్లి జాతీయ రహదారిపై పత్తి రైతుల ఆందోళన
పత్తి రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ.. సీసీఐ కేంద్రం ద్వారా ఎకరాకు పత్తి 12 క్వింటాలు నుంచి 7 క్వింటాలకు కొనుగోలు తగ్గించడం అన్యాయమని తెలిపారు. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో సీసీఐ కొనుగోలు చేయాలని కోరారు.