*ప్రకాశం జిల్లా తేదీ:10.11.2025* *ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు* ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ ప్రాంతంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ల సహకారంతో విస్తృత తనిఖీలు చేసి నిర్వహించారు.