తాడిపత్రి మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలూరు కోన క్షేత్రంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని శనివారం శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అర్చనలు, అభిషేకాలు, ఆకు పూజ వంటి పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి క్యూ లైన్ లో నిలుచుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.