తాడికొండ: గుంటూరు: ఇప్పటి వరకు రూ.2,24,28,410 సీజ్...
గుంటూరు: ఇప్పటి వరకు రూ.2,24,28,410 సీజ్ జిల్లాలో శనివారం ప్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీలలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ. 3,20,700లు, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.1.91 లక్షల నగదు పట్టుబడింది. గుంటూరు పశ్చిమలో 2,280 విలువ గల 3.06లీటర్ల లిక్కర్ని స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరిగిన తనిఖీలలో శనివారం వరకు రూ. 2,24,28,410ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.