సోమరాయణంపేటకు చెందిన యువకుడి మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
కిర్లంపూడి మండలం సోమరాయణంపేట గ్రామానికి చెందిన రాజు అనే 29 సంవత్సరాల యువకుడు తన ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంక తిరిగి రాకపోవడంతో రాజు కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల బంధువుల ఇంటి వద్ద వెతికిన ఎక్కడ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తక్షణం స్పందించిన ఎస్ఐ సతీష్ తమ సిబ్బందిని టీములు టీములుగా ఏర్పాటు చేసి ట్రేస్ అవుట్ చేయగా ప్రకాశం జిల్లా పొదిలి వద్ద రాజు యొక్క ఆచూకీ లభ్యం కావడంతో సురక్షితంగా తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సి వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు.