హైదరాబాద్ లోని PVNR ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 47 వద్ద ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు తీవ్రంగా దెబ్బతినగా, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు