నర్సిపూడిలో పంచాయతీ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయంటూ స్థానికులు అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిరసన
ఆలమూరు మండలం నర్సిపూడిలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ మేరకు స్థానికులు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెరువులు ఆక్రమణకు గురి కావడంతో పంచాయతీకి ఆదాయం ఉండడం లేదని వారు వాపోయారు.