అనంతపురం నగర శివారులోని నారాయణపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన హేమంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని ఆటో సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.