కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం షాపూర్ నగర్ లో బుధవారం ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ర్యాలీ జరిగింది. దేశవ్యాప్త ఆందోళనలలో భాగంగా, రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ వరకు జరిగిన ఈ ర్యాలీలో వామపక్ష కార్మిక సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి.