కోడుమూరు: కోడుమూరులో కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా మోటార్ వర్కర్స్ యూనియన్ ధర్నా
కోడుమూరు పట్టణంలో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తోందని విమర్శించారు. పోరాటాలతో సాధించుకున్న 44 చట్టాలను నాలుగు బార్ కోడ్ లుగా మార్చి కార్మికులను అణగతొక్కడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా వెనక్కు తగ్గి కార్మికుల హక్కులను సంరక్షించాలని కోరారు.