అసిఫాబాద్: రెబ్బెన సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం మహిళా రైతుల పడిగాపులు
రెబ్బెన మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద మంగళవారం తెల్లవారుజామునే రైతులు చేరుకుని పట్టా పాస్ పుస్తకాలు క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. ప్రతి రోజూ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఎదుట వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా సరిపోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.