కుషాయిగూడను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కుషాయిగూడ బస్సు స్టాప్ నుంచి కాపుర సర్కిల్ కార్యాలయం వరకు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ తమ డిమాండ్ ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కుషాయిగూడ కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, పరిపాలన సౌకర్యాలు మెరుగుపరిచాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేశారు.