మూడు నెలలుగా అనుమానాస్పదంగా ఆత్మకూర్ బస్టాండ్ వద్ద ఆటో..
నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద జేమ్స్ గార్డెన్ సెంటర్ ఒకటో రోడ్డు పక్కనే ఆటో అనుమానాస్పదంగా ఉంది. మూడు నెలల నుంచి ఆటో అక్కడే ఉండడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. ఎవరైనా దీని దొంగలు ఇచ్చారా లేక ఫైనాన్స్ కట్టలేక ఇక్కడ వదిలి వెళ్లారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకి సమాచారం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.