తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అప్పబట్లపల్లి గ్రామంలో వృద్ధుడిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి బుధవారం రాత్రి పాలు కోసం ఊరి చివర వెళ్లి నడిచి వస్తున్న క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కర్రతో తీవ్రంగా గాయపరిచారని బాధితులు తెలిపాడు అనంతరం గ్రామస్తులు ఓ ప్రైవేటు వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించారు అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు