రాయదుర్గం: పట్టణంలో చిరుత సంచారంతో స్థానికుల భయాందోళన
రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డు సమీప కాలనీలు, కొండ ప్రాంతాల ప్రజలకు చిరుత నిద్రలేకుండా చేస్తోంది. గత వారం రోజులుగా కొండలో చిరుత సంచారిస్తూ రాత్రి వేళల్లో కొండదిగి వస్తోందని వాపోయారు. గొర్రెలు, మేకలు, పశువుల కోపం వస్తోందన్నారు. శుక్రవారం సాయంత్రం మరోసారి కొండపై చిరుత ను చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన కరువైందని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.