తాడిపత్రి మండలం వరదాయపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న చుక్కలూరు గ్రామానికి చెందిన రత్నకుమార్ (21) తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రి ఆసుపత్రికి అనంతరం అనంతపురం తదనంతరం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై తాడిపత్రి రూరల్ శివ గంగాధర్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.