బ్రాహ్మణపల్లి తండాలో హై వోల్టేజీ కారణంగా ఇళ్లలో కాలిపోయిన బల్బులు ఫ్యాన్లు టీవీలు
విద్యుత్ హై వోల్టేజి కారణంగా శ్రీ సత్య సాయి జిల్లా బ్రాహ్మణపల్లి తండాలో వందల ఇళ్లలో బల్బులు ఫ్యాన్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు కాలిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో మరమ్మతుకు గురైందని, విద్యుత్ సిబ్బంది సమస్య పరిష్కరించామని చెప్పడంతో అందరం సంతోషించామన్నారు. అయితే ఉన్నఫలంగా హై వోల్టేజ్ రావడంతో వందల ఇళ్లలో ఫ్యాన్లు బల్బులు టీవీలు కాలిపోయాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే మాకు ఈ నష్టం వాటిల్లిందని బాధితులు శాంతాబాయి సోను బాయి ప్రేమ్ కుమార్ మండిపడ్డారు