భువనగిరి: పట్టణాన్ని అన్ని హంగులతో మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రోడ్డు విస్తరణ పనులను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి పట్టణాన్ని అన్ని హంగులతో మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అందుకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.